Reading Time: < 1 minute
Ahmedabad Air India Plane Crash Us Fas Allegations Technical Failures

గతేడాది జూన్ 12న అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమాన ప్రమాదం అనేక కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఒక్కరు మినహా విమానంలో ఉన్న 260 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా హాస్టల్‌పై కూలిపోవడంతో మెడికోలు కూడా మృతిచెందారు. దేశ చరిత్రలో అతి పెద్ద ఘోర ప్రమాదం ఇదే. ఈ ప్రమాదంపై రెండు దర్యాప్తు సంస్థలు విచారణ జరిపాయి.

తాజాగా ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్న ఏఏఐబీ, జాతీయ రవాణా భద్రతా బోర్డు (NTSB)లపై అమెరికాకు చెందిన ఫౌండేషన్‌ ఆఫ్‌ ఏవియేషన్‌ సేఫ్టీ (FAS) తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ విమానంలో గత 11 ఏళ్లుగా పలు సాంకేతిక సమస్యలు ఉన్నాయని వెల్లడించింది. విమానంలో తీవ్రమైన ఎలక్ట్రానిక్స్‌ సమస్యలు, పవర్‌ కంట్రోల్‌ యూనిట్‌, ఫ్లైట్‌ మేనేజ్‌మెంట్‌ కంప్యూటర్‌లో వైఫల్యాలను గుర్తించినట్లు పేర్కొంది. విమానంలో లోపాలకు సంబంధించి బహిర్గతం కాని పలు పత్రాలను తాము సేకరించామని.. వాటిని నిశితంగా పరిశీలించాకే ఈ విషయాన్ని వెల్లడించామని ఎఫ్‌ఏఎస్‌ పేర్కొంది. అయితే అమెరికా చేసిన ఆరోపణలపై భారత దర్యాప్తు సంస్థలు ఎలా స్పందిస్తాయో చూడాలి.

జూన్ 12, 2025న అహ్మదాబాద్ నుంచి లండన్‌కు ఎయిరిండియా విమానం బయల్దేరింది. టేకాఫ్ అయిన కొన్ని సెకన్లకే విమానం మెడికోలు హాస్టల్‌పై కూలిపోయింది. దీంతో విమానంలో ఉన్నవారితో పాటు మెడికోలు కలిసి దాదాపు 280 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన యావత్తు దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.

ఇది కూడా చదవండి: ATM Withdraw: రూ.10 వేలు విత్‌డ్రా చేస్తే రూ.3 లక్షలొచ్చాయి. అసలు కథేంటంటే..!