Reading Time: 2 minutes
Ktr Slams Telangana Government Over Six Guarantees Rythu Bandhu Delay At Gun Park

KTR: తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించిన అనంతరం గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాష్ట్ర కేటీఆర్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలు కాలేదని, ముఖ్యంగా ఆరు గ్యారెంటీలకు ఇప్పటివరకు చట్టబద్ధత కల్పించలేదని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని గతంలో గవర్నర్ ప్రసంగంలో చెప్పించినప్పటికీ ఇప్పటికి రెండున్నర సంవత్సరాలు గడిచినా ఎలాంటి చట్టబద్ధత లేదని కేటీఆర్ అన్నారు. ఈ అంశంపై రాబోయే బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వాన్ని తప్పకుండా నిలదీస్తామని అన్నారు.

Bollywood : భారత్ విభజన తర్వాత జ్ఞాపకాలు, ప్రేమ చుట్టూ తిరిగే భావోద్వేగ కథతో వస్తున్న స్టార్ డైరెక్టర్

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో రైతు బంధు సమయానికి అందేదని, కానీ ప్రస్తుతం రైతులు పంటలు కోయడానికి వచ్చినా.. రైతు బంధు గురించి ప్రభుత్వం నుంచి స్పష్టత లేదని కేటీఆర్ విమర్శించారు. “రాహుల్ బంధు కాదు.. రైతు బంధు వేయండి అంటూ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. బలహీన వర్గాల కోసం ఐదేళ్లలో లక్ష కోట్ల బడ్జెట్ కేటాయిస్తామని ప్రభుత్వం చెప్పిందని, కానీ ఇప్పటికే రెండు బడ్జెట్లు పూర్తయ్యినా ఆ దిశగా స్పష్టత కనిపించలేదని ఆయన అన్నారు. ఎస్సీ, ఎస్టీలకు అంబేద్కర్ అభయహస్తం పథకం కింద 12 లక్షలు ఇస్తామని చెప్పినా ఇప్పటివరకు అమలు కాలేదని ఆరోపించారు.

రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చినా ఇప్పటివరకు 10 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని కేటీఆర్ అన్నారు. అలాగే జాబ్ క్యాలెండర్ ప్రకటించినప్పటికీ కొత్త ఉద్యోగాలు కనిపించడం లేదని విమర్శించారు. మహిళలకు ఇవ్వాల్సిన హామీలు, వృద్ధులకు 4000 రూపాయల పెన్షన్, రైతులకు రైతు భరోసా, రైతు కూలీలకు నెలకు 1000 రూపాయల సహాయం వంటి అంశాలు ఇంకా అమలు కాలేదని.. ఆటో డ్రైవర్లకు ఇవ్వాల్సిన సహాయం కూడా పెండింగ్‌లో ఉందని పేర్కొన్నారు.

Vaibhav Suryavanshi: ఐపీఎల్‌లో ఆ దిగ్గజం రికార్డ్‌ను బద్ధలుకొడుతా.. వైభవ్ సూర్యవంశీ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణలో విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు సుమారు 10 వేల కోట్ల వరకు ఉన్నాయని కేటీఆర్ అన్నారు. ఈ బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. మాజీ సీఎం కేసీఆర్ నిర్మించిన బలమైన రాష్ట్రాన్ని ప్రస్తుత ప్రభుత్వం సరిగా నిర్వహించలేకపోతోందని, వ్యవస్థలో అవ్యవస్థలు నెలకొన్నాయని.. తెలంగాణను ఒక ఏటీఎంగా మార్చి ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారని ఆరోపించారు. ఈ అన్ని అంశాలపై రాబోయే సమావేశాల్లో ప్రజల తరపున పోరాడతామని కేటీఆర్ స్పష్టం చేశారు.