July 11, 2026

వర్సిటీల్లో కుల వివక్ష నిర్మూలనకు ‘రోహిత్ చట్టం’ తేవాల్సిందే : ఎస్ఎఫ్ఐ నేతలు

వర్సిటీల్లో కుల వివక్ష నిర్మూలనకు ‘రోహిత్ చట్టం’ తేవాల్సిందే : ఎస్ఎఫ్ఐ నేతలు
Reading Time: < 1 minute

వర్సిటీల్లో కుల వివక్ష నిర్మూలనకు ‘రోహిత్ చట్టం’ తేవాల్సిందే : ఎస్ఎఫ్ఐ నేతలు

Caption of Image.
  • అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెట్టాలని ఎస్‌ఎఫ్‌ఐ నేతల డిమాండ్​

హైదరాబాద్, వెలుగు:  దేశంలోని ఉన్నత విద్యాసంస్థలు, యూనివర్సిటీల్లోని కుల వివక్ష నిర్మూలనకు రోహిత్ చట్టం తీసుకురావాల్సిందేనని ఎస్ఎఫ్ఐ నేతలు డిమాండ్​చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్. రజనీకాంత్ అధ్యక్షతన రాష్ట్ర సదస్సును నిర్వహించి ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.  

ఈ సందర్భంగా విజ్ఞాన దర్శిని వ్యవస్థాపక అధ్యక్షుడు టి. రమేశ్​మాట్లాడుతూ వర్సిటీల్లో కులవివక్షకు వేదికలుగా మారుతున్నాయన్నారు. కుల వివక్ష కారణంగానే రోహిత్ వేముల వంటి మెరిట్ విద్యార్థులను  దేశం కోల్పోయిందన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే రోహిత్ చట్టం చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు హామీ ఇచ్చిందని గుర్తు చేశారు.  అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. 

©️ VIL Media Pvt Ltd.