
వదంతుల నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం ప్రకటన
టెల్ అవీవ్ : ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు యుద్ధంలో మరణించి ఉంటారని వస్తున్న ఊహాగానాలపై ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం కూడా స్పందించింది. ప్రధాని క్షేమంగా ఉన్నారని ఎక్స్ వేదికగా స్పష్టం చేసింది. నెట్టింట ప్రచారంలో ఉన్న వదంతులను కొట్టిపారేసింది. ఇక నెతన్యాహు తనయుడు కూడా కొన్ని రోజులుగా కనిపించట్లేదన్న వార్త కూడా ప్రస్తుతం కలకలం రేపుతోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆయన మార్చ్ 9 నుంచి ఎలాంటి పోస్టులు పెట్టకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. గత శుక్రవారంనాడు నెతన్యాహు తన ఎక్స్ ఖాతాలో పెట్టిన వీడియో సందేశంతో కూడిన పోస్ట్‌పై పెద్ద ఎత్తున అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఈ వీడియోలో పలు మార్లు నెతన్యాహు చేతి వేళ్లు ఆరు ఉన్నట్లు కనిపించాయి. అది ఏఐ వీడియో అని, నెతన్యాహు మరణించి ఉంటారని నెటిజన్లు అభిప్రాయపడ్డారు.