Reading Time: < 1 minute

ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే మమతా బెనర్జీ కీలక నిర్ణయం

Caption of Image.

కోల్‎కతా: వెస్ట్ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ పూజారులు, మౌజన్లకు గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలోని పూజారులు, మౌజన్ల గౌరవ వేతనాలను రూ.500 పెంచుతున్నట్లు ప్రకటించారు. 2026, మార్చి 15న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‎ను ఈసీ విడుదల చేయనున్న విషయం తెలిసిందే. షెడ్యూల్ విడుదలకు గంటల ముందే సీఎం మమతా బెనర్జీ ఈ నిర్ణయం తీసుకున్నారు. 

షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వస్తోంది. ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి వీలు ఉండదు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల షెడ్యూల్ విడుదలకు గంటల ముందే పూజారులు, మౌజన్ల గౌరవ వేతనం హైక్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. 

ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ నేతృత్వంలోని ఎన్నికల కమిషనర్ సుఖ్బీర్ సింగ్ సంధు, ఎన్నికల కమిషనర్ వివేక్ జోషిలతో కూడిన ఎన్నికల ప్యానెల్, ఆదివారం (మార్చి 15)  మధ్యాహ్నం 4 నాలుగు గంటలకు బెంగాల్‎తో పాటు తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనుంది. 

©️ VIL Media Pvt Ltd.