Reading Time: < 1 minute

మోడల్ మున్సిపాలిటీగా యాదగిరిగుట్ట అభివృద్ధి : ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య.

Caption of Image.
  • ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య.

యాదగిరిగుట్ట, వెలుగు: రాష్ట్రంలోని మున్సిపాలిటీలకు ఆదర్శంగా నిలిచేలా యాదగిరిగుట్టను మోడల్ మున్సిపాలిటీగా అభివృద్ధి చేస్తామని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ప్రకటించారు. శుక్రవారం యాదగిరిగుట్ట మున్సిపల్ కార్యాలయంలో జరిగిన నూతన పాలకవర్గ మొదటి సాధారణ సమావేశంలో ఆయన మాట్లాడారు.

పట్టణంలో మౌలిక సదుపాయాల సమస్యలు లేకుండా ప్రతీ వార్డులో అండర్ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని, సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో ప్రత్యేక నిధులు మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు  సమావేశానికి ముందు ఆయన వంగపల్లి, బాహుపేట తదితర గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

©️ VIL Media Pvt Ltd.