Reading Time: < 1 minute
Sadhvi Prachi Warning Monalisa Farman Marriage Controversy

Monalisa: మహ కుంభమేళా సమయం పూసలమ్మే అమ్మాయిగా దేశవ్యాప్తంగా ఫేమస్ అయిన ‘‘మోనాలిసా భోంస్లే’’ మరోసారి వార్తల్లో వ్యక్తిగా మారారు. ఇటీవల ఆమె కేరళలో తన ముస్లిం బాయ్‌ఫ్రెండ్ ఫర్మాన్ ఖాన్‌ను వివాహం చేసుకోవడం సంచలనంగా మారింది. చాలా మంది ఇది ‘‘లవ్ జిహాద్’’ అంటూ ఆరోపణలు చేశారు. అయితే, తమది లవ్ జిహాద్ కాదని ఇద్దరు కూడా స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే ప్రముఖ హిందుత్వవాది సాధ్వీ ప్రాచీ చేసిన వ్యాఖ్యలు మరింత సంచలనంగా మారియి. ఉత్తర్ ప్రదేశ్ బాగ్‌పత్ లో జరిగిన ఒక కార్యక్రమంలో సాధ్వీ ప్రాచీ ఆర్య మాట్లాడుతూ.. మోనాలిసా, ఫర్మాన్ ఖాన్‌ల పెళ్లి ‘‘లవ్ జిహాద్’’ అని అభివర్ణించారు. ఈ పెళ్లి తర్వాత ఆమెకు కలిగే పరిణామాలు చాలా భయంకరంగా ఉంటాయని హెచ్చరించారు.

Read Also: TG Crop Loan: పంట రుణాల పరిమితి ఖరారు.. ఒక్క ఎకరాకు ఎంత రుణం ఇస్తారంటే..

గతంలో శ్రద్ధావాకర్‌కు, నికితా తోమర్‌‌ల హత్య కేసులాగే మోనాలిసా పరిస్థితి అవుతుందని చెప్పారు. రెండేళ్ల క్రితం శ్రద్ధావాకర్‌ అనే అమ్మాయిని అతడి బాయ్‌ఫ్రెండ్ అఫ్తాబ్ పూనావాలా అత్యంత దారుణంగా ముక్కలుగా నరికి, ఫ్రిజ్‌లో పెట్టాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పుడు మోనాలిసా మృతదేహం కూడా 35 ముక్కలుగా ఫ్రిజ్‌లో దొరికినా ఆశ్చర్యపోనక్కర లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఫర్మాన్ ఒక హిందువుగా మారి పెళ్లి చేసుకుంటే స్వాగతించే వాళ్లమని, కానీ ఇది మోసపూరిత లవ్ జిహాద్ అని ఆమె పేర్కొన్నారు. మోనాలిసాకు లవ్ జిహాద్, మదర్సాల్లో ఇచ్చే శిక్షణ గురించి అవగాహన లేదని అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకుందని సాధ్వీ అన్నారు. హిందూ కుటుంబాలు తమ పిల్లల మెడలో పంది దంతాలు కట్టాలని, అలా చేస్తే ఇతర మతస్తులు వారి దరిదాపుల్లోకి రారని చెప్పారు.