July 10, 2026

Half Day Schools: విద్యార్థులకు ఎగిరిగంతేసే వార్త.. ఒంటిపూట బడులు వచ్చేశాయ్.. ఎప్పటి నుంచంటే..

Half Day Schools: విద్యార్థులకు ఎగిరిగంతేసే వార్త.. ఒంటిపూట బడులు వచ్చేశాయ్.. ఎప్పటి నుంచంటే..
Reading Time: < 1 minute
Telangana Govt Announced Half Day Schools From March 16 To April 23 Know Details Here

తెలంగాణ రాష్ట్రంలో ఎండల తీవ్రత దృష్ట్యా పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు మార్చి 16 నుంచి ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట బడులు (Half-Day Schools) నిర్వహించనున్నట్లు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతిరోజూ ఉదయం 8:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు తరగతులు జరుగుతాయి. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నం 12:30 గంటలకు భోజనం వడ్డించిన తర్వాత విద్యార్థులను ఇంటికి పంపిస్తారు.

Also Read:Urea: రైతుల యూరియా కష్టాలకు చెక్.. ఆ జిల్లాలకు భారీగా బస్తాలు..

టెన్త్ ఎగ్జామ్స్ జరిగే స్కూళ్లలో షెడ్యూల్ మారుతుంది. అక్కడ మధ్యాహ్నం 1:00 గంట నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు ఒంటిపూట బడులు నిర్వహిస్తారు. పదో తరగతి విద్యార్థులకు పరీక్షల దృష్ట్యా యధావిధిగా ప్రత్యేక తరగతులు కొనసాగుతాయి. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం.. ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు విద్యార్థులకు వేసవి సెలవులు ఉండనున్నాయి. తిరిగి 2026-27 విద్యా సంవత్సరం జూన్ 12 నుంచి ప్రారంభం కానుంది. ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది.