
ఇందిరమ్మ ప్రభుత్వం అంటే ప్రజా ప్రభుత్వమని అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. బుధవారం (మార్చి 11) వెలుగుమట్ల బాధితులకు ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. పేద వర్గానికి ఇల్లు లేకుండా ఉండొద్దని క్యాబినేట్ నిర్ణయం తీసుకుందని అన్నారు.
వెలుగుమట్లలో 412 మందిని అధికారికంగా గుర్తించామని తెలిపారు. ప్రతి పేద కుటుంబానికి ఆసరాగా నిలిచామన్నారు. బాధితులకు ఇంటి తో పాటుగా సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
వెలుగుమట్లలో ప్రభుత్వమే దగ్గర ఉండి భూమి పూజ చేయించి ఇండ్ల నిర్మాణం మొదలు పెడుతుందని తెలిపారు. పట్టాలు ఇచ్చి భూమి పూజా చేయాలని కలెక్టర్ ను ఆదేశించారు. డిసెంబర్ 9 న రాష్ట్ర ముఖ్యమంత్రిని ఖమ్మం ఆహ్వానించి గృహప్రవేశం చేయిస్తామని తెలిపారు.
పేదల కోసం నిలబడి పని చేసే ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రక్రియ ఖమ్మంలో కనిపిస్తుందన్నారు భట్టీ. ప్రతి పక్షానికి పేదలపై ప్రేమ లేదు.. పేదల నిస్సహాయతను అడ్డు పెట్టి రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. వెలుగుమట్లలో సమాంతర రాజ్యం నడిచిందని.. అక్కడి ప్రజలను సంరక్షించే ప్రయత్నం చేస్తే అధికారుల పై దాడికి యత్నించారన్నారు.
పేద వర్గాలు ఆత్మ గౌరవంగా బతికేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు భట్టీ. తప్పుడు రికార్డులు సృష్టించి కోర్టులను తప్పుదోవ పట్టించారని మండిపడ్డారు. అక్కడ చట్ట బద్దత చేయాలని నేటి ప్రభుత్వం నిర్ణియిస్తే.. ప్రభుత్వం పై బురద జల్లే ప్రయత్నాలు బీఆర్ఎస్ చేసిందని విమర్శించారు.
పేద ప్రజల పక్షానా కాంగ్రెస్ ప్రభుత్వానికి కమిట్మెంట్ ఉందన్నారు. డబుల్ బెడ్ రూం లు ఇస్తామని గతంలో బీఆర్ఎస్ మోసం చేసిందని అన్నారు. బాధితులకు సొంతూర్లో ఉన్న వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశామని తెలిపారు. పేదల నిస్సహాయతను అడ్డుపెట్టుకుని దోచుకున్న వారి పై కఠిన చర్యలు తీసుకుని డబ్బులు తిరిగి చెల్లిస్తామని చెప్పారు. మాఫియాలతో , బ్లాక్ మెయిలర్లతో భయపడాల్సిన అవసరం లేదన్నారు.
వెలుగుమట్ల భూముల్లో విద్యా వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు డిప్యూటీ సీఎం. మిగతా 16 ఎకరాల్లో తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మిస్తామన్నారు. స్థలం మిగిలితే రెంటెడ్ బిల్డింగ్ లో ఉన్న వెల్ఫేర్ హస్టల్స్ నిర్నిస్తామని తెలిపారు. అదే విధంగా అక్కడ కమ్యునిటీ హల్ నిర్మిస్తామన్నారు. ఇందిరమ్మ ఇండ్లు చూసి ఇతర రాష్ట్రాలు అసూయ పడేలా నిర్మిస్తామని హామీ ఇచ్చారు.