July 11, 2026

గల్ఫ్లో ఉన్న భారతీయులను అందరినీ కాపాడుతాం: ప్రధాని మోదీ

గల్ఫ్లో ఉన్న భారతీయులను అందరినీ కాపాడుతాం: ప్రధాని మోదీ
Reading Time: < 1 minute

గల్ఫ్లో ఉన్న భారతీయులను అందరినీ కాపాడుతాం: ప్రధాని మోదీ

Caption of Image.

గల్ఫ్ లో ఉన్న భారతీయులను అందరినీ కాపాడుతామని అన్నారు ప్రధాని మోదీ. కేరళ పర్యటనలో భాగంగా బుధవారం (మార్చి 11)  ఎర్నాకుళం లో మాట్లాడిన ప్రధాని.. సంక్షోభ సమయంలో ప్రజలను ఒంటరిగా విడిచిపెట్టమని అన్నారు. ఇండియన్ ఎంబసీలు 24 గంటలు సాయం అందిస్తున్నాయని చెప్పారు.

భారతీయుల రక్షణపై గల్ఫ్ దేశాల నేతలతో మాట్లాడినట్లు చెప్పారు ప్రధాని మోదీ. ఇప్పటికే భారతీయులను సురక్షితంగా తీసుకొస్తున్నామని తెలిపారు. పశ్చిమాసియా యుద్ధంపై ఆందోళన అవసరంలేదని ఈ సందర్భంగా అన్నారు.

►ALSO READ | సూరత్లో భారీ అగ్ని ప్రమాదం.. పేపర్ మిల్లులో మంటలు, పొగలు.. భారీ పేలుడు

దేశ భద్రతపై విపక్షాలు తప్పుడు ప్రచారం చేయొద్దని కోరారు ప్రధాని మోదీ. ప్రపంచ సంక్షోభాన్ని కాంగ్రెస్ రాజకీయాలకు వాడుకుంటోందని విమర్శించారు. డ్రోన్ల తయారీలో భారత్ అద్భుతమైన విజయాలు సాధించినట్లు కొనియాడారు. కేరళ టూరిజంను అభివృద్ధి చేయడంలో తమ వంతు సాయం చేస్తామని చెప్పారు. ఆత్మనిర్భర భారత్, మేకిన్ ఇండియాలో పెట్రోలియం సెక్టార్ కీలకమన్నారు. కొచ్చి రిఫైనరీలో పాలీప్రొపైలీన్ యూనిట్ కు శంకుస్థాపన చేశారు ప్రధాని. 

©️ VIL Media Pvt Ltd.