Reading Time: < 1 minute

తెలుగులో ప్రమాణం చేసిన కొత్త గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా

Caption of Image.

 తెలంగాణ కొత్త గవర్నర్ గా  శివ ప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకారం చేశారు.  లోక్ భవన్ లో హైకోర్టు సీజే ఆపరేష్ కుమార్  శివ ప్రతాప్ శుక్లాతో తెలుగులో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు  స్పీకర్ గడ్డం ప్రసాద్,మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

ఉత్తరప్రదేశ్ కు చెందిన శుక్లా 2014 ఎన్డీఏ కేబినెట్ లో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి గా పనిచేశారు.  తెలంగాణ గవర్నర్ గా ఉన్న జిష్ణుదేవ్ వర్మ ను కేంద్రం మహారాష్ట్ర గవర్నర్ గా నియమించిన సంగతి తెలిసిందే. 2024 జులై 31 నుంచి జిష్ణుదేవ్ వర్మ ఏడాదిన్నార పాటు తెలంగాణ గవర్నర్ గా విధులు నిర్వర్తించారు

©️ VIL Media Pvt Ltd.