
బంగ్లాదేశ్‌కు పైపులైన్ ద్వారా 5000 టన్నుల డీజిల్‌ను పైపులైన్ ద్వారా బుధవారం సరఫరా చేయడానికి భారత్ సన్నద్ధమైందని మంగళవారం అధికారి ఒకరు తెలిపారు. అస్సాం లోని ప్రబాతిపూర్ డిపో నుంచి సోమవారం నుంచే డీజిల్‌ను పైపులైన్ ద్వారా తీసుకోవడం ప్రారంభమైందని బంగ్లాదేశ్ పెట్రోలియం కార్పొరేషన్ అధికారప్రతినిధి ఒకరు తెలిపారు. మొత్తం 5000 టన్నులు పంపింగ్ చేయడానికి 45 గంటలు పడుతుందన్నారు.ప్రతిగంటకు 113 టన్నుల డీజిల్‌ను పంప్ చేస్తున్నట్టు చెప్పారు. 15 ఏళ్ల దీర్ఘకాలిక ఒప్పందం ద్వారా ఏటా 180000 టన్నుల డీజిల్ భారత్ నుంచి సరఫరా చేయడానికి అంగీకారమైనట్టు తెలిపారు.