Reading Time: < 1 minute

మాస్ మహరాజ రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో డింపుల్ హయాతి, అషిక రంగనాథ్‌లు హీరోయిన్లుగా నటించారు. ఈ సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదు అనిపించింది. భార్య, ప్రేమించిన అమ్మాయి మధ్య నలిగిపోయే వ్యక్తిగా రవితేజ ఈ సినిమాలో కనిపించారు. అయితే ఈ సినిమా రిలీజై చాలాకాలమే అయినా.. ఒటిటిలో ఇప్పటివరకూ విడుదల కాలేదు. దీంతో అభిమానులు ఈ సినిమా ఎప్పుడు ఒటిటిలో వస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా ఒటిటి రిలీజ్ డేట్ అధికారికంగా వచ్చేసింది. ప్రముఖ ఒటిటి సంస్థ జి-5లో ఈ సినిమా విడుదల కానుంది. మార్చి 13వ తేదీ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు జి-5 అధికారికంగా ప్రకటించింది. దీంతో రవితేజ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.