Reading Time: < 1 minute

విశాఖపట్నం: కాలు విరిగింద‌ని వెళ్తే బాలుడి ప్రాణాలు తీసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలో జరిగింది. ఆరేళ్ల బాలుడు అక్షయ్ కు కాలు విరగడంతో కెజిహెచ్ లో తల్లిదండ్రులు చేర్పించారు. కెజిహెచ్ లో చికిత్స పొందుతూ బాలుడు చనిపోయాడు. ప్రమాదంలో కాలు విరగడంతో కెజిహెచ్ లో తమ కుమారుడిని చికిత్స కోసం కెజిహెచ్ లో చేర్పించామన్నారు. సర్జరీ అనంతరం అక్షయ్ ఆరోగ్యం విషమించిందని, కాలు ఆపరేషన్ కోసం వస్తే తమ కుమారుడిన వైద్యులు పొట్టన పెట్టుకున్నారని బాలుడి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. కెజిహెచ్ సిబ్బంది నిర్లక్ష్యంతోనే అక్షయ్ ప్రాణం తీశారని తండ్రి ఆరోపణలు  చేశాడు. బాలుడికి ఇన్ ఫెక్షన్ కు గురికావడంతోనే చనిపోయి ఉంటాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.