Reading Time: < 1 minute

అమరావతి: అనుమానంతో భార్యను చంపేసి అనంతరం మృతదేహాన్ని లారీలో తీసుకెళ్లి అటవీ ప్రాంతంలో పడేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఎల్లనూరు రోడ్డు ప్రాంతంలో సుధాకర్-శ్రీలేఖ అనే దంపతులు నివసిస్తున్నారు. సుధాకర్ లారీ డ్రైవర్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. భార్యపై అనుమానంతో దంపతుల మధ్య గత కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగతున్నాయి. అనుమానంతో రగిలిపోయిన భర్త భార్యను చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని లారీలో తీసుకెళ్లి ముచ్చుకోట అటవీ ప్రాంతంలో పడేశాడు. అనంతరం తానే హత్య చేశానని పెద్దపప్పూరు పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.