Reading Time: < 1 minute

డిఫరెంట్ ఎంటర్‌టైైనర్స్ చేస్తున్న తరుణ్ భాస్కర్, రైటర్- డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్‌తో కలిసి ’గాయపడ్డ సింహం’తో అలరించబోతున్నారు. ఈ చిత్రాన్ని సప్తస్వ మీడియా వర్క్, పిఓవి స్టోరీస్, జీ స్టూడియోస్ నిర్మిస్తున్నాయి. పవన్ సాదినేని ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఇటివల విడుదలైన ఫన్ ఫిల్ ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా సినిమాకు సంబంధించిన ఫన్ ప్రమోషనల్ ర్యాప్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాట సినిమా సటైరికల్ టోన్‌ను అద్భుతంగా చూపిస్తోంది. ఈ చిత్రంలో మానస చౌదరి, ఫరియా అబ్దుల్లా కథానాయికలు కాగా, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం2026 వేసవిలో థియేటర్లలో విడుదల కానుంది.

సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో హీరో తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ.. ‘కశ్యప్ శ్రీనివాస్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. అసలైన హీరో ఈ సినిమాకి ఆయన, ఆయన కథ. కష్టపడ్డ సింహం ఆయన. అదృష్టమైన సింహాన్ని నేను. తప్పకుండా ఈ సినిమాని ఫ్రెండ్స్‌తో ఫ్యామిలీతో కలిసి చూడండి’ అని అన్నారు. ప్రొడ్యూసర్ భాను కిరణ్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమాని మా డైరెక్టర్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా తీశాడు. సినిమా చాలా బాగా వచ్చింది’ అని పేర్కొన్నారు. డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘త్వరలోనే ఈ సినిమా రిలీజ్ అవుతుంది. అందరిని ఎంటర్‌టైన్ చేస్తుంది’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రమోద్ అసుర పాల్గొన్నారు.