Reading Time: < 1 minute

బాలానగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. నాలుగేళ్ల చిన్నారి మృతి

Caption of Image.

హైదరాబాద్: బాలానగర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.లారీ, బైక్ ఢీకొన్న ఘటనలో నాలుగేళ్ల చిన్నారి స్పాట్ లోనే చనిపోయింది. చిన్నారి లారీ వెనక టైర్ల కింద పడటంతో శరీర భాగాలు నుజ్జునుజ్జయ్యాయి. ఈ విషాద ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళితే.. 

హైదరాబాద్ సిటీపరిధిలోని బాలానగర్ పీఎస్ పద్మనగర్ ఫేజ్ 1 వెంకటేశ్వర స్వామి ఆలయ సమీపంలో శనివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. వేద శ్రీ (4) అనే చిన్నారి మేనమామతో కలిసి బైక్ పై వెళ్తుండగా లారీ ఢీకొట్టింది. కిందపడిపోయిన చిన్నారిపైనుంచి లారీ వెనుక చక్రం వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది.

►ALSO READ | కుటుంబకలహాలతో.. భార్యను కత్తితో పొడిచిన భర్త

సమాచారం అందుకున్న బాలానగర్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

©️ VIL Media Pvt Ltd.