Reading Time: 2 minutes
25 సిక్స్‌లు, 13 ఫోర్లు.. 91 బంతుల్లో డబుల్ సెంచరీ.. ఫాంలోకి వచ్చేసిన కాటేరమ్మ కొడుకు..

Abhishek Sharma 233 Runs: జింబాబ్వే పర్యటనలో తీవ్రంగా నిరాశపరిచిన యంగ్ సెన్సేషన్ అభిషేక్ శర్మ మైదానంలో మళ్ళీ రుద్రరూపం చూపించాడు. పంజాబ్ లోకల్ క్రికెట్ టోర్నీలో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తూ ఆకాశమే హద్దుగా విరుచుకుపడ్డాడు. కేవలం 91 బంతుల్లోనే 233 పరుగుల విధ్వంసకర ద్విశతకంతో తనలో తగ్గని పవర్ ఏంటో ప్రపంచానికి మరోసారి చాటిచెప్పాడు.

ఇటీవల ముగిసిన జింబాబ్వే పర్యటనలో అభిషేక్ శర్మ తీవ్రంగా విఫలమయ్యాడు. 3 ఇన్నింగ్స్‌లలో కలిపి కేవలం 11 పరుగులు మాత్రమే చేసి తీవ్ర విమర్శలు మూటగట్టుకున్నాడు. ఐర్లాండ్, ఇంగ్లాండ్, జింబాబ్వే సిరీస్‌లలో కలిపి 10 ఇన్నింగ్స్‌ల్లో 191 పరుగులు మాత్రమే చేయడంతో అతడి ఫామ్‌పై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. విమర్శకుల నోళ్లు మూయించడానికే అన్నట్లు పంజాబ్ స్టేట్ ఇంటర్ డిస్ట్రిక్ట్ వన్డే టోర్నీలో అమృత్‌సర్ తరఫున ఓపెనర్‌గా దిగి ఊచకోత కోశాడు.

ఇది కూడా చదవండి: IND vs SL: శ్రీలంకతో ఫైనల్ ఛాన్స్ రా భయ్.. ఫెయిలైతే టీమిండియాలో నీ కెరీర్ క్లోజ్..!

25 సిక్సర్లు, 15 ఫోర్లు.. మైదానంలో పరుగుల తుఫాన్..

అమృత్‌సర్‌లోని గాంధీ మైదానంలో తరణ్ తరణ్ జట్టుపై అభిషేక్ శర్మ ఆడిన ఇన్నింగ్స్ క్రికెట్ చరిత్రలోనే నిలిచిపోతుంది. ప్రత్యర్థి బౌలింగ్‌ను చీల్చి చెండాడుతూ గ్రౌండ్ నలుమూలలా బౌండరీల వర్షం కురిపించాడు. కేవలం 91 బంతుల్లో 15 ఫోర్లు, ఏకంగా 25 దిమ్మతిరిగే సిక్సర్ల సాయంతో 233 పరుగులు బాదాడు. సహచర ఓపెనర్ అభయ్ చౌదరితో కలసి మొదటి వికెట్‌కు కేవలం 24.4 ఓవర్లలోనే 305 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడం గమనార్హం. అభిషేక్ విధ్వంసంతో అమృత్‌సర్ జట్టు 50 ఓవర్లలో 533 పరుగుల భారీ స్కోరు సాధించింది.

జపాన్ ఏషియన్ గేమ్స్ ముందర లభించిన కొండంత కొండ..

జపాన్‌లో త్వరలో జరగబోయే 2026 ఏషియన్ గేమ్స్‌కు భారత జట్టులో స్థానం సంపాదించిన అభిషేక్‌కు ఈ ఇన్నింగ్స్ కొండంత ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. ఇటీవల టీ20 ప్రపంచకప్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ సత్తా చాటినప్పటికీ, అంతర్జాతీయ మ్యాచ్‌లలో నిలకడలేమి అతడిని వెంటాడుతోంది. జపాన్ పర్యటనకు ముందు సాధించిన ఈ డబుల్ సెంచరీ అతడిలో నూతన ఉత్సాహాన్ని నింపిందనడంలో సందేహం లేదు.

ఇది కూడా చదవండి:132 ఫోర్లు, 168 సిక్స్‌లతో 1670 పరుగులు.. క్రిస్ గేల్‌కే మెంటలెక్కించేలా వైభవ్ విధ్వంసం..

టీమిండియాలో రేసు తీవ్రం.. సత్తా చాటాల్సిందే..

ప్రస్తుతం భారత జట్టులో ఓపెనింగ్ స్థానం కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. 15 ఏళ్ల వయసులోనే వైభవ్ సూర్యవంశీ జింబాబ్వే టూర్ లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ కొట్టి రేసులోకి వచ్చాడు. దాంతో పాటు ఇషాన్ కిషన్, ప్రభ్‌సిమ్రన్ సింగ్, సంజూ శామ్సన్ లాంటి ఆటగాళ్లు అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. రాబోయే ఏషియన్ గేమ్స్‌లో అభిషేక్ శర్మ కచ్చితంగా రాణించాల్సిందే. లేదంటే జట్టులో స్థానాన్ని కాపాడుకోవడం కష్టంగా మారనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..