
హైదరాబాద్: టి20 వరల్డ్ కప్ 2026ను టీమిండియా గెలుచుకుంది. ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను 96 పరుగుల తేడాతో ఓడించి ప్రపంచ కప్‌ను భారత జట్టు కైవసం చేసుకుంది. భారత జట్టుపై మాజీ క్రికెటర్లు సునీల్ గావస్కర్, సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అభినందనలు తెలిపారు. వరల్డ్ కప్ గెలిచిన వెంటనే కోచ్ గౌతమ్ గంభీర్ సాబ్ ముఖంపై చిరునవ్వు చాలా బాగుందని మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని తెలిపాడు. విజయం సాధించాలనే పట్టదల, ముఖంలో చిరునవ్వు కిల్లర్ కాంబినేషన్ అని కొనియాడారు. ఛాంపియన్ బౌలర్ అంటేనే జస్ప్రీత్ బుమ్రా అని ధోని మెచ్చుకున్నారు.
టి20 ఫార్మాట్‌లో ఒకే జట్టు వరసగా రెండు సార్లు వరల్డ్ కప్ గెలుచుకోవడం గొప్పవిషమని మాజీ ఆటగాడు సచిన్ ప్రశంసించారు. టి20లలో 20 నుంచి 30 పరుగుల తేడాతో గెలిస్తేనే గొప్ప అని, అలాంటి 96 పరుగుల తేడాతో ఫైనల్‌లో గెలవడం అతి భారీ విజయమని మాజీ బ్యాట్స్‌మెన్ సునీల్ గావస్కర్ కొనియాడరు. టి20 వరల్డ్ కప్ లో సంజు శామ్సన్ అద్భుతమైన ఆట తీరు కనబరిచారని టీమిండియా బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ ప్రశంసించారు. టీమిండియాలోని ప్రతిభావంతులైన ఆటగాళ్లతో మరెవరూ సరితూగలేరని విరాట్ తెలిపారు. గల్లీ క్రికెట్ ఆడినంత సులువుగా బ్యాటింగ్ చేశారని మాజీ బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్ కొనియాడారు. టి20 ప్రపంచ కప్ మూడు సార్లు గెలవడం గొప్ప విషయమన్నారు.