
అమరావతి: విద్యుత్ షాక్ తో రెండు ఏనుగులు మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లా నెరబైలు ప్రాంతంలో జరిగింది. తురకపల్లి సమీపంలో మామిడితోపులో వేరుశనగ పంటకు ఓ రైతు కరెంట్ తీగలు వేశాడు. విద్యుత్ షాక్ తగిలి రెండు ఏనుగులు మృతి చెందాయి. స్థానికుల సమాచారం మేరకు అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకొని ఏనుగుల కళేబరాలను స్వాధీనం చేసుకున్నారు. అటవీ శాఖ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.