
ఢిల్లీ: పశ్చిమాసియాలోని పరిస్థితులను ప్రధాని నరేంద్ర మోడీ పర్యవేక్షిస్తున్నారని విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ తెలిపారు. శాంతికి ఎలాంటి విఘాతం కలిగినా ప్రపంచం మొత్తం ప్రభావం ఉంటుంది అన్నారు. విపక్ష సభ్యులు ప్రకటన ముందు చర్చ చేపట్టాలని నినాదాలు చేయడంతో విపక్ష సభ్యుల నినాదాల మధ్యే జైశంకర్ ప్రకటన చేశారు. పార్లమెంట్ సమావేశ సందర్భంగా రాజ్యసభ లో ఆయన మాట్లాడారు. భారతీయుల రక్షణ కోసం ప్రత్యేక చర్యలు, గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న భారతీయుల రక్షణకు చర్యలు చేపట్టామని జైంకర్ తెలియజేశారు. సంబంధిత శాఖలన్నింటికీ తగిన చర్యలు తీసుకోవాలని సూచించామని, పశ్చిమాసియాలో పరిస్థితులు తీవ్ర ఆందోళనకలు కలిగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధం పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నామని, చర్చలు, దౌత్యపరంగా సమస్య పరిష్కారమవుతుందని భారత్ నమ్ముతుందని అన్నారు. పశ్చిమాసియాలో చిక్కుకున్న భారతీయులను వెనక్కి రప్పించే చర్యలు చేపట్టామని, భారత్ ఎప్పుడూ శాంతినే కోరుకుంటోందని జైశంకర్ స్పష్టం చేశారు.