
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాన్వాయ్‌లో ట్రయల్ రన్ వాహనం ఢీకొని ఓ యువకుడు మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా దోర్నాల మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… చిన్నగుడిపాడు శివారులో సిఎం చంద్రబాబు నాయుడు భద్రతా ఏర్పాట్లను పరిశీలించే వాహనం బైక్‌ను ఢీకొట్టడంతో అంకన్న అనే యువకుడు చనిపోయాడు. మృతుడి తల్లి ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహం పట్టుకొని కన్నీంటిపర్యంతమైంది. వెంటనే మృతదేహాన్ని మార్కాపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాన్వాయ్ రాంగ్ రూట్లో వచ్చిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పినట్టు తెలుస్తోంది. కుమారుడి మృతికి పరిహారం ఇవ్వాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.