Reading Time: < 1 minute

ఏకాంతం

ఈ ఒంటరితనం మనసుకి

అలవాటైపోయిందా లేక

ఇది ఎవరిమీదైనా ఫిర్యాదా

నిరంతరం ఎగసిపడే

ఆలోచనల తరంగాలలో

నా ఉనికే మర్చిపోయినా

అలుపెరగని ఊహల లోతుల్లో

ఇమిడిపోయిన నాకు

నిజజీవితం అనిపించదా, అల్లకల్లోలంగా

పొగమంచులా కమ్మేసిన విషాదం

వినిపించదా వేణుగానంలా

ఎప్పటికీ నెరవేరని కలల్లో

ఆదమరిచానా మగతగా

రంగులు వెలిసి, రూపం చెదిరి

మసకగా మిగిలిపోయిన కలల్లో

ఏం వెతుకుతున్నాను ఇంకా ఊహల్లోనే

మిగిలిపోయిన నా మనసుకి

స్వాంతనే…..నా ఏకాంతం!!

– సుష్మ