Reading Time: < 1 minute

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం ఏటికొప్పాకలో బాలుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏటికొప్పాక గ్రామ శివారులో బాలుడి మృతదేహం కనిపించిడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. బాలుడి శరీరంపై గాయాలు ఉన్నట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. యలమంచిలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.