Reading Time: < 1 minute

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. టోకేన్ లేని భక్తులు శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. ఆదివారం శ్రీవారిని  77,879 మంది భక్తులు దర్శించుకోగా 25,520 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.19 కోట్లుగా టిటిడి అధికారులు వెల్లడించారు.