
నగరంలో తయారైన డగ్స్ రాజస్థాన్‌కు తరలించి విక్రయాలు
రాజస్థాన్‌లో పట్టుబడ్డ నిందితుల విచారణలో షాద్‌నగర్ డ్రగ్ తయారీ నెట్‌వర్క్ బట్టబయలు
మన తెలంగాణ/హైదరాబాద్: నగరంలో భారీ సింథటిక్ డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టయ్యింది. షాద్ నగర్ లో మెఫెడ్రోన్ తయారు చేస్తున్న అంతర్రాష్ట్ర గ్యాంగ్‌పై హైదరాబాద్ నార్కోటిక్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. తెలంగాణ ఈగల్ టీం సమాచారంతో ఆదివారం షాద్ నగర్‌లోని సింథటిక్ డ్రగ్స్ తయారీ కేంద్రంపై దాడి చేసిన పోలీసులు భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌ఆర్ ఇన్నోవేషన్స్ ఇండియా సంస్థ ద్వారా డ్రగ్స్ తయా కి ఉపయోగించే ప్రికర్సర్ కెమికల్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించామని 2-బోమో 4-మిథైల్ప్రొపియోఫెనోన్‌వంటి కెమికల్స్‌ను ఆన్ లైన్లో విక్రయిస్తున్నట్లు గుర్తించామని పోలీసులు వెల్లడించారు.
ఈ కెమికల్స్‌తో నిషేధిత డ్రగ్ మెఫెడ్రోన్ తయారు చేస్తున్నట్లు అనుమానిస్తున్నామని తెలిపారు. ప్రధాన నిందితుడు వీరేంద్ర స్వామి అలియాస్ గిరీష్ తాపర్ సహా పలువురు నిందితులు డ్రగ్స్ తయారీలో ఉన్నట్లు తెలిపారు. నిందితులు నకిలీ అడ్రస్‌లతో కెమికల్స్ ఆర్డర్ చేసి షాద్ నగర్‌లో ల్యాబ్ ఏర్పాటు చేసి డ్రగ్స్ తయారు చేస్తున్నారని తెలిపారు. మొత్తం 300 కిలోల వరకు కెమికల్ కొనుగోలు చేసి ట్లు విచారణలో వెల్లడైందని తెలిపారు.
నగరంలో తయారైన డ్రగ్స్‌ను రాజస్థాన్‌కు తరలించి అమ్ముతున్నట్లు గుర్తించామని తెలిపారు. రాజస్థాన్‌లో పోలీసులు వీరేంద్ర స్వామి, మనీష్ బిష్ణోయ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా, ఈ విచారణలో షాద్‌నగర్ డ్రగ్ తయారీ నెట్‌వర్క్ బయటపడిందని హైదరాబాద్ నార్కోటిక్స్ పోలీసులు వెల్లడించారు.