
టి20 ప్రపంచకప్ 2026 ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా బ్యాటర్లు విధ్యంసం సృష్టించారు. దీంతో భారత్, న్యూజిలాండ్ పై భారీ స్కోరు సాధించింది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ కు ఓపెనర్లు అభిషేక్ శర్మ(52), సంజూ శాంసన్(89)లు న్యూజిలాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో తొలి వికెట్ కు 7.1 ఓవర్లలోనే 98 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించారు. ఆ తర్వాత వచ్చిన ఇషాన్ కిషన్(54) కూడా అర్ధశతకంతో మెరుపులు మెరిపించాడు.
ఈ క్రమంలో న్యూజిలాండ్ బౌలర్ నీషమ్ అద్భుతమైన బౌలింగ్ తో ఒకే ఓవర్ లో మూడు కీలక వికెట్లు తీసి భారత్ జోరుకు బ్రేకు వేశాడు. ఇక, చివర్లో శివమ్ దూబే భారీ షాట్లతో చెలరేగాడు. దీంతో లాస్ట్ ఓవర్ లో 24 పరుగులు వచ్చాయి. దీంతో భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 255 పరుగుల భారీ స్కోరు సాధించింది. న్యూజిలాండ్ బౌలర్లలో నీషమ్ మూడు వికెట్లు పడగొట్టగా.. హెన్రీ, రచిన్ రవీంద్ర చెరో వికెట్ తీశారు.