
చోడవరం: అనకాపల్లి జిల్లా చోడవరం మండలం గోవాడలో భారీ చోరీ జరిగింది. బిఎన్ రోడ్డు పక్కనే ఉన్న సుజాత అనే మహిళ ఇంట్లో 65 తులాల బంగారం, కొంత నగదును గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. నగదుతో కలిపి చోరీకి గురైన సొత్తు విలువ రూ.1.5 కోట్లు ఉంటుందని అంచనా. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీం తనఖీలు చేపట్టింది.