
ఐసిసి టీ-20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగే ఈ ఉత్కంఠ పోరు కోసం ఇరు దేశాల అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే పాకిస్థాన్‌కు చెందిన మాజీ పేసర్ మహమ్మద్ అమిర్ మరోసారి భారత్‌పై ద్వేషంతో విషం చిమ్మాడు. ఈ సీజన్ మొదటి నుంచి భారత్ ప్రతీ మ్యాచ్‌లో ఓడిపోతుంది అంటూ అమిర్ అక్కస్సు వెళ్లగక్కుతూ వస్తున్నాడు. కానీ, భారత్ మాత్రం అద్భుత ప్రదర్శనలు చేస్తూ ఫైనల్స్ వరకూ చేరింది. ఇప్పుడు ఈ ఫైనల్స్‌లోనూ భారత్ ఓటమిపాలవుతుందంటూ అమిర్ జోస్యం చెప్పాడు.
‘హార్నా మనా హై’ అనే షోలో అమిర్ మాట్లాడుతూ.. ఫైనల్‌లో న్యూజిలాండ్ విజయం పక్కా అని పేర్కొన్నాడు. ‘‘సెమీ ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను న్యూజిలాండ్ ఓడించిన తీరు అద్భుతం వారు ఒక జట్టుగా రాణిస్తున్నారు. కానీ, భారత్ విషయానికొస్తే.. కేవలం జస్ప్రీత్ బుమ్రా, సంజూ శాంసన్ ప్రదర్శన వల్లే ఇక్కడి దాకా వచ్చింది. వీరిద్దరు లేకపోతే భారత్ గెలిచేది కాదు. అంటే ఆ జట్టులో ఐక్యత లోపించింది’’ అని అమిర్ వ్యాఖ్యానించాడు. ఇక అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో పిచ్ పరిస్థితి బట్టి చూస్తే న్యూజిలాండ్‌కు అనుకూలిస్తుందని అమిర్ అన్నాడు. బౌలింగ్‌లోనూ భారత్ కంటే కివీస్ ఎంతో బలంగా ఉందని పేర్కొన్నాడు.
అంతేకాక.. భారత బౌలింగ్‌పై తన అక్కస్సును వెళ్లగక్కాడు అమిర్. భారత బౌలింగ్‌లో బుమ్రా తప్ప మరెవరూ ఫామ్‌లో లేరని అతడు అన్నాడు. టీం ఇండియా మొత్తం బుమ్రాపై ఆధారపడి ఉందని పేర్కొన్నాడు. మరోవైపు న్యూజిలాండ్ బౌలింగ్ అద్భుతంగా ఉందని కొనియాడాడు. ఇక ఓపెనర్ అభిషేక్ శర్మపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశాడు. అభిషేక్ ‘వన్ డైమెన్షనల్’ ప్లేయర్ అని, అంతర్జాతీయ స్థాయిలో అడేందుకు సిద్ధంగా లేడని అన్నాడు. ఫైనల్ జట్టులో అభిషేక్ స్థానంపై చర్చ జరుగుతున్న, జట్టు మేనేజ్‌మెంట్ మాత్రం అతనికి మద్దతుగా నిలుస్తోందని అన్నాడు. ఇలాంటి వాళ్ల నోటికి తాళం వేయాలంటే భారత్ అన్ని విభాగాల్లో రాణించి. కప్పు కొట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు.