Reading Time: < 1 minute

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్ సమావేశాలను నిర్వహించడానికి అసెంబ్లీ సెక్రటరీ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాలు ఈనెల 16వ తేదీన అసెంబ్లీ హాల్‌లో (ఉభయ సభల సంయుక్త సమావేశాలు) ఉదయం 11.45 గంటలకు ప్రారంభమవుతాయని, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఉద్ధేశించి గవర్నర్ ప్రసంగిస్తారని ఈ నోటిఫికేషన్‌లో ఆయన తెలిపారు. ఉభయ సభలను గవర్నర్ సమన్ చేశారు.