Reading Time: < 1 minute

క్షమాపణలపై ట్రంప్ స్పందన..

తుడిచిపెట్టేస్తామని ఘాటైన హెచ్చరిక

వాషింగ్టన్: పశ్చిమాసియాలో ఇప్పుడు ఇరాన్ ఓడిపోయిన దేశం అయిందని, ఓటమిని అంగీకరించిందని అమెరికా అధ్యక్షులు ట్రంప్ తెలిపారు. ఇరాన్ అధ్యక్షులు పలు గల్ఫ్‌దేశాలకు క్షమాపణలు చెప్పడం ద్వారా లొంగిపోయారని వ్యాఖ్యానించారు. ఇకపై తిరిగి దాడులకు దిగబోమని కూడా ఇరాన్ ప్రకటించింది. ఇదంతా కూడా అమెరికా, ఇజ్రాయెల్ సాగిస్తూ వస్తున్న నిర్విరామ దాడుల ప్రభావమే అని తెలిపారు. ఎప్పుడూ ఎవరికి లొంగకుండా వందల ఏండ్ల చరిత్రతతో ఉన్న ఇరాన్ ఇప్పుడు తొలిసారిగా ఇతర దేశాలకు సారీ చెప్పిందని ట్రంప్ గుర్తు చేశారు.

ఇతర ప్రాంతాలను , ప్రత్యేకించి గల్ఫ్‌లోని కీలక దేశాలను బెదిరించాలని ఇంతకాలం ఇరాన్ యత్నించింది. అయితే అమెరికా దెబ్బతో ఈ పనిచేయలేకపోయిందని, ఇప్పటి క్షమాపణలు ఈ ప్రాంతం లో ఇరాన్ పెత్తనాన్ని దెబ్బతీసే చారిత్రక ఘట్టానికి దారితీస్తాయని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరాన్ పూర్తి స్థాయిలో లొంగిపోవడం లేదా ఓడిపోవడం జరగాల్సిం దే. అంతవరకూ తమ దాడులు సాగిస్తూనే ఉంటామని ట్రంప్ తెలిపారు. ఇక అత్యంత తీవ్రస్థాయి పరిణామంగా ఇరాన్ ఇక ఏ కోశానా కోలుకోకుండా సర్వనాశనం అయ్యేలా దాడులకు ప్లాన్ చేస్తున్నామని ట్రంప్ హెచ్చరించారు.

ఇరాన్ పరాజిత అయి కూర్చుంది. ఇక ఈ దశలోనే తమ సేనలు మరింతగా ఇరాన్‌ను వేయించుకుతింటాయని (రోస్ట్) అని ట్రంప్ స్పందించారు. ఇరాన్ ఇప్పుడు మిడిలిస్టు చవట అని వ్యాఖ్యానించారు. వేలాది సంవత్సరాలలో ఎప్పుడూ ఇరాన్ ఓడిపోలేదు. తొలిసారిగా ఇరాన్ కొమ్ము విరిచింది తామేనని ట్రంప్ తెలిపారు. తనను పలు గల్ఫ్ దేశాలు అభినందిస్తున్నాయి. థ్యాంక్యూ ట్రంప్ అని నేతలు చెపుతున్నారని, వీటిని తాను స్వీకరిస్తున్నానని తెలిపారు,