Reading Time: 2 minutes

తిట్లు ఆపి రైతుబంధు ఇవ్వాలి

సిఎంపై బిఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ఫైర్

మన తెలంగాణ/ఉమ్మడి కరీంనగర్ బ్యూ రో: బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాం లో,కేసీఆర్ నాయకత్వంలో కరీంనగర్ జిల్లాను అద్భుతమైన వాటర్ హబ్‌గా మార్చామని .. పొద్దున లేస్తే కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని రేవంత్ రెడ్డి పదేపదే అబద్ధా లు చెబుతున్నాడని మాజీ మంత్రి, డిప్యూ టీ ఫ్లోర్ లీడర్ హరీష్‌రావు మండిపడ్డారు. శనివారం కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి నియోజకవర్గం కురిక్యాల గ్రామం కొండన్నపల్లి బ్రిడ్జి వద్ద వరద కాలువను మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్‌రావు బీఆర్ ఎస్‌నేతలతో కలిసి పరిశీలించారు. గోపాల్ రావుపల్లి గ్రామంలో ఎండిపోయిన పంట పొలా లను పరిశీలించగా రైతులు ఎండిపోయిన పొలాలను చూపిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు.

అనంతరం ఆయన గ్రామంలో‘రైతులతో మాట ముచ్చట’కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈసం దర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో, కేసీఆర్ నాయకత్వం లో కరీంనగర్ జిల్లాను అద్భుతమైన వాటర్ హబ్‌గా మార్చామని స్పష్టం చేశారు. పొద్దున లే స్తే కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని రేవంత్ రెడ్డి పదేపదే అబద్ధాలు చెబుతున్నాడనిమం డిపడ్డారు. మొన్న లక్ష్మి పంప్ హౌస్ మోటార్లు ఆన్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వరద కాలువలకు నీళ్లు వదిలారు. మరి ఆ వరద కాలువలలో పారుతున్న నీళ్లు కాళేశ్వరం నీళ్లు కావా..? అని హరీష్‌రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.కాళేశ్వరంలో భాగమైన లక్ష్మీ పంప్ హౌ స్ మోటార్లు నడుస్తుంటేనే కదా ఈ నీళ్లు వచ్చాయన్నారు.

రైతన్నకు సకాలంలో రైతుబంధు ఇవ్వు : ఎన్నికల ముందు మూడు పంటలకు రైతుభరోసా ఇస్తామని చెప్పి, ఇప్పుడు మూడు పంట లకు రైతుబంధు ఎగ్గొట్టిన రైతు ద్రోహి రేవంత్ రెడ్డి అని హరీష్ రావు మండిపడ్డారు. నీ బూతులు రైతుల కడుపు నింపవు.. బూతులు ఆపి.. సకాలంలో రైతుబంధు ఇవ్వాలి, యూరియా ఇవ్వాలి అని రేవంత్‌రెడ్డికి సూచించారు. కేసీఆర్‌రెండు పంటలకు రైతు బంధు ఇస్తే.. మూడు పంటలకు రైతు బంధు ఇయ్యాలని మాట్లాడిన రేవంత్‌రెడ్డి.. ఇయ్యాలా మూడు పంటలకు రైతు బంధు ఎగ్గొట్టిండు. నువ్వు వచ్చినంక ఇచ్చేవి 5 రైతు బంధులు.. వాటిలో రెండిచ్చినవు.. మూడు ఎగ్గొట్టినవ్.. నీకు తిట్ల మీద ధ్యాస తప్ప రైతుల మీద లేదు. నీకు బూతుల మీదున్న ప్రేమ రైతులపై లేదు. పోయిన యాసంగికి బోనస ఎగ్గొట్టినవ్.. ఈ యాసంగికి రైతు బంధు ఎగ్గొట్టినవ్. వడగండ్ల వానకు, తుఫానుకు నష్టపోయిన రైతులకు ఇవాళ్టికి కూడా ఒక్క రూ పాయి కూడా సాయం చేయకుండా రైతు వ్యతిరేకిగా మారాడన్నారు. 99 రోజుల ప్రణాళి క’అంటూ మళ్లీ కొత్త డ్రామాలు మొదలుపెట్టారని కాంగ్రెస్ సర్కార్‌పై హరీష్‌రావు ధ్వజమెత్తారు.