
మేష రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. శుభకార్యాల నిర్వహిస్తారు. ప్రభుత్వ ప్రకారం గా రావలసిన బెనిఫిట్స్ చేతికి అందుతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. స్వల్ప అనారోగ్యం సమస్యలుంటాయి. చేపట్టిన పనులు శ్రమతో గాని పూర్తికావు. ప్రయాణాలు వాయిదా పడతాయి. వ్యాపార విస్తరణకు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులకు రావలసిన పదవుల విషయంలో కొంత జాప్యం కలుగుతుంది. ఈ రాశి వారికి ఏలిన నాటి శని నడుస్తున్నప్పటికీ అనుకూలంగానే ఉంటుందని చెప్పవచ్చు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటాబయట బాధ్యతలు పెరుగుతాయి. సంతానం మంచి అభివృద్ధిలోకి వస్తారు. విదేశీ ప్రయాణాలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. విదేశాలలో ఉన్న వారికి కాలమంతా అనుకూలంగా లేదు. విద్యార్థిని విద్యార్థులు కష్టపడి చదవాలి. ప్రతిరోజు కూడా ఓం నమశ్శివాయ వత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి అష్టకం చదవండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది కలిసివచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు గురువారం కానీ శనివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
వృషభ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. మృత్యువు ఉద్యోగాలపరంగా మీరు ఆశించిన ఫలితాలు పొందగలుగుతారు. నూతన వ్యాపారాల పెట్టుబడికి అధికంగా ఖర్చు చేయవలసి ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాల కంటే సొంతంగా చేసే వ్యాపారాలు కలిసి వస్తాయి. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. భూ సంబంధమైన విషయ వ్యవహారాలలో ఉన్న వివాదాలు తీరుతాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సహోదరీ సహోదరుల మధ్య ఉన్న విభేదాలు తీరిపోతాయి. చిన్ననాటి మిత్రుల నుండి కొంత కీలక సమాచారం అందుతుంది. కుటుంబ పరంగా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపార పరంగా ఏర్పడిన చిన్న చిన్న సమస్యలను అధిగమిస్తారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. విద్యార్థిని విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించాలి. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారు ప్రతి రోజు శని గ్రహ స్తోత్రాన్ని చదవండి సుబ్రమణ్య స్వామి వారికి అభిషేకం చేయించండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 6 కలిసివచ్చే రంగు మెరూన్. ఏదైనా పనిమీద బయటకు వెళ్లేటప్పుడు బుధవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
మిధున రాశి వారికి ఈ వారం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. కుటుంబ సభ్యుల సహకారం ప్రతి విషయంలో లభిస్తుంది. మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు. కెరియర్ పరంగా స్థిరత్వం లభిస్తుంది. దూరప్రయాణాలలో వాహన ఇబ్బందులు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. ప్రతిరోజు సుబ్రహ్మణ్యస్వామి అష్టకం చదవండి సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయించండి. ధన పరమైన విషయాల్లో జాగ్రత్త వహించాలి. నూతన ఋణ ప్రయత్నాలు ఫలించవు. కొన్ని కొన్ని విషయాలలో గోప్యత అనేది తప్పనిసరి అవసరం. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. విద్యార్థిని విద్యార్థులకు మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. దక్షిణామూర్తి రూపు మెడలో ధరించండి. ఉద్యోగ వాతావరణం నిరుత్సాహంగా ఉంటుంది. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. విదేశీ ప్రయాణాలు కొద్దికాలం వాయిదా పడతాయి. ఆర్థికంగా మరింత పురోగతి సాధిస్తారు. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. భూ క్రయవిక్రయాలు లభిస్తాయి. గృహమున సంతాన వివాహ విషయమై ప్రస్తావన వస్తుంది. శుభకార్యాల నిమిత్తం ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం వరిస్తుంది. వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. రుణాలు తీర్చగలుగుతారు. నూతన వాహనం కొనుక్కొని చేస్తారు. నిరుద్యోగులకు అధికారుల అండదండలతో నూతన అవకాశాలు లభిస్తాయి. మంగళవారం మరియు శనివారం రోజున హనుమాన్ వత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 5 కలిసివచ్చే రంగు గ్రీన్. ఏదైనా పనిమీద బయటకు వెళ్లేటప్పుడు సోమవారం కానీ బుధవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
సింహ రాశి వారికి గడిచిన వారం కంటే కూడా ఈ వారం బాగుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి కాంట్రాక్టర్లకి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి నిత్యవసర సరుకులు అమ్మేవారికి హోటల్ వ్యాపారస్తులకు బాగుంటుందని చెప్పవచ్చు. అధిక శ్రమతో అద్భుత ఫలితాన్ని పొందుతారు. కొన్ని విషయాలలో బంధుమిత్రులతో మాటపట్టింపులు కలుగుతాయి. శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో జాప్యం కలుగుతుంది. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. విదేశీ ప్రయాణాలు వాయిదా వేస్తారు. వ్యాపారస్తులకు స్వల్ప లాభాలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు తొలగిపోతాయి. ప్రతిరోజు ఓం నమో నారాయణ వత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణ చేయండి లేదా వినండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఒకటి కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పనిమీద బయటకు వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ గురువారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు పొందగలుగుతారు.
కన్యా రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కెరియర్ కోసం చేసే ప్రయత్నాలు చికాకు కలిగిస్తాయి. వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఇంటాబయట ఒత్తిడులు అధిగమించి ముందుకు సాగుతారు. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. రాజకీయరంగంలో ఉన్నవారికి కలిసి వస్తుంది. సినీ రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు. వ్యాపారస్తులకు పెట్టుబడులు సకాలంలో అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. విదేశీ ప్రయాణాలు వాయిదా పడతాయి. మొండి బకాయిలు వసూలవుతాయి. ఈ రాశి వారు ప్రతి రోజు హనుమాన్ చాలీసా చదవండి. సోమవారం శుక్రవారం లక్ష్మీ తామర వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య ఎనిమిది కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పనిమీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ గురువారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
తులా రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి వ్యాపారాల పరంగా లాభసాటిగా ఉంటుంది. ఖర్చులు అదుపులో ఉంటాయి. స్థిరాస్తి వ్యవహారాలు ఓ కొలిక్కి వస్తాయి. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. వాహన వ్యాపారస్తులకు మరింత పురోగతి కలుగుతుంది. నూతన రుణాలు చేయకుండా ఉండటం మంచిది. ఉద్యోగంలో నూతన అవకాశాలు కలిసి వస్తాయి. ఆత్మీయులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగ పరంగా అధికారులతో చర్చలు అనుకూలిస్తాయి. విదేశీ ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. నిరుద్యోగుల కలలు సాకారం అవుతాయి. కొన్ని వ్యవహారాలలో తెలివిగా వ్యవహరించి అందరి మన్ననలు పొందుతారు. వైద్య వృత్తిలో ఉన్న వారికి ఒత్తిడి అధికంగా ఉంటుంది. శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ రాశి వారు ప్రతిరోజు అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ మంగళవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాలు లాభసాటిగా ఉంటాయి. శత్రువులు అధికంగా ఉంటారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి లభించదు. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. విదేశీ ప్రయాణాలు కొంతకాలం వాయిదా వేయడం మంచిది. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. పునర్వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచన విధానం మార్చుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో దైవదర్శనం చేసుకుంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వ్యాపార ప్రారంభానికి చేసే ప్రయత్నాలు కొంత మందకొడిగా సాగుతాయి. ఈ రాజు వారు ప్రతిరోజూ కూడా ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 6 కలిసివచ్చే రంగు గ్రే. ఏదైనా పనిమీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ మంగళవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
ధనస్సు రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి అర్థాష్టమ శని నడుస్తోంది. ఉద్యోగంలో స్థానచలనం లభిస్తుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించండి. గృహ వాతావరణం చికాకుగా ఉంటుంది. చేపట్టిన పనులలో శ్రమ మరింత అధికమవుతుంది. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. రుణాలు తీరుస్తారు. గో సేవ చేస్తారు. కొద్దికాలం విదేశీ ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వ్యాపారస్తులకు కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. విద్యార్థులు చదువుపై మరింత శ్రద్ధ వహించాలి. ఆర్థిక పరిస్థితి కొంత మందగిస్తుంది. సంతానానికి మంచి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశి వారు ప్రతి రోజు అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఒకటి కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
మకర రాశి వారికి ఈ వారం గడిచిన వారం కంటే ఈ వారం బాగుంటుంది. ఉద్యోగ పరంగా కెరియర్ పరంగా స్థిరత్వం లభిస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. నూతన వ్యాపారం ప్రారంభిస్తారు. గృహ వాతావరణం ఉత్సాహకరంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో నూతన లాభాలను అందుకుంటారు. కొంతవరకు రుణాలు తీరుస్తారు. సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వాహన యోగం ఉన్నది. ముఖ్యమైన విషయాలలో సొంత నిర్ణయాలు కలిసి రావు. స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. విద్యార్థులు చదువుపై మరింత శ్రద్ధ వహించాలి. జీవిత భాగస్వామి సలహాలు కలసివస్తాయి. ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా చదవండి. రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ ఆదివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
కుంభ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. కానీ ఆరోగ్యం విషయంలో సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు వహించాలి. సంతానం యొక్క అభివృద్ధి బాగుంటుంది. విదేశీ ప్రయాణాలు వాయిదా పడతాయి. వ్యాపార విషయంలో ఆప్తుల సలహాలు తీసుకోవడం మంచిది. సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. ఈ రాశి వారికి ఏలిన నాటి శని నడుస్తోంది 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించండి. ముఖ్యమైన పనులు సజావుగా సాగుతాయి. మిత్రుల నుండి విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు. శుభకార్యాలు ముడి పడతాయి. స్నేహితులను నమ్మి మోసపోయా అవకాశం ఉంది జాగ్రత్త వహించండి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి లాభాలు బాగుంటాయి. వ్యాపారాలలో ఏర్పడిన అవరోధాలు అధిగమిస్తారు. ఉద్యోగమున పై అధికారుల వలన ఏర్పడిన ఆటంకాలు తొలగుతాయి. విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది మీ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. జంక్ ఫుడ్ కి దూరంగా ఉండండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది కలిసివచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
మీన రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకు చాలావరకు అనుకూలంగా ఉంది. ఆర్థిక లావాదేవీలు కొంతవరకు మందకొడిగా సాగుతాయి. విద్యార్థిని విద్యార్థులకు కాలమనుకూలంగా ఉంది మీకు కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది చదువుపై మరింత శ్రద్ధ వహించండి. నూతన గృహం కొనుగోలు చేస్తారు. కొన్ని వ్యవహారాలలో ఆలోచనలు మార్చుకుంటారు. ఖర్చులు అదుపులో ఉంటాయి. శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. విదేశాలకు వెళ్లడానికి మీరు చేసే ప్రయత్నాలు ఆలస్యం అవుతాయి. కుటుంబసభ్యుల నుంచి ఆశించిన సహాయం లభించదు. విదేశీ ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. వ్యాపారము లాభాల బాటలో ఉంటుంది. వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులకు కార్యాలయంలో అదనపు పనిభారం ఉంటుంది. ప్రతిరోజు కూడా అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. నవగ్రహ స్తోత్రాలు ప్రతిరోజు చదవండి. సోమవారం మరియు శుక్రవారం రోజున లక్ష్మీ తామర వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య అయిదు కలిసి వచ్చే రంగు 8, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్లేటప్పుడు గురువారం కానీ శనివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.