
మన తెలంగాణ/హైదరాబాద్‌ః బిఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారన్న ఆరోపణ ఎదుర్కొంటున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత పిటిషన్‌పై విచారణ దాదాపు పూర్తయ్యింది. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ శనివారం దానం నాగేందర్ తరఫు న్యాయవాదుల వాదన విన్నారు. తమ క్లయింట్ ఎమ్మెల్యే దానం పార్టీ ఫిరాయించలేదని చెప్పారు.
ఇదిలాఉండగా స్పీకర్ స్పీకర్ తీర్పును రిజర్వ్ చేసినట్లు సమాచారం. మొత్తం పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు దాఖలు కాగా స్పీకర్ ప్రసాద్ కుమార్ ఇదివరకే ఎనిమిది మంది ఎమ్మెల్యే పిటిషన్లను తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. మరో ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై దాఖలైన అనర్హత పిటిషన్‌పైనా స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.