
చెన్నై : కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ విడాకుల వివాదం మరింత ముదురుతోంది. తాజాగా విజయ్ భార్య సంగీత ఆయన ఇంట్లో ఉండడానికి అనుమతి కోరారు. తాను వివాహిత ఏ ఇంట్లోనైతే అడుగుపెట్టానో ఆ ఇంట్లోనే ఉండడానికి అనుమతిని ఇప్పించాలని తాజాగా కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. విజయ్ – సంగీత రెండేళ్లుగా విడివిడిగా ఉంటున్నారు. తన భర్తకు మరో నటితో వివాహేతర సంబంధాలు ఉన్నాయని, ఆయనతో విడాకులు ఇప్పించాలని ఇప్పటికే కోర్టుకెక్కారు.
తాజాగా సంగీత తాను లండన్ జాతీయురాలినని, వేరోచోట ఉండడానికి వీల్లేదని, అందుకే విజయ్ ఇంట్లో ఉండడానికి అనుమతిని ఇప్పించాలని కోరారు. తొలుత దాఖలు చేసిన విడాకుల పిటిషన్‌పై నిర్ణయం వెలువడే వరకు తన ఆయన నివాసంలో ఉండే విధంగా ఆదేశాలు ఇవ్వాలని, అది తన హక్కు అని కూడా తెలిపారు. ఈ మేరకు శనివారంనాడు ఇక్కడి న్యాయస్థానంలో అఫిడవిట్ దాఖలు చేశారు. తాను ఇంట్లో ఉండాలని లాయర్ ద్వారా అడిగిస్తే విజయ్ బెదిరిస్తున్నట్లు చెప్పారు. అంతేకాకుండా ఈ భరణం, పరస్పర విడాకులు అంటూ వస్తోన్న వార్తలో నిజం లేదని స్పష్టత ఇచ్చారు. పరస్పర విడాకులకు విజయ్ అంగీకరించడం లేదని స్పష్టం చేశారు.