
చెన్నై: తమిళనాడు ఎన్నికల దృష్ట్యా టివికె పార్టీ అధినేత విజయ్ పలు హామీలను ప్రకటించారు. అన్ని రకాల ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చారు. పాఠశాల చిన్నారులకు ఏటా రూ.15 వేలు ఆర్థిక సహాయం ఇస్తామని అన్నారు. మహిళల రక్షణ కోసం ప్రత్యేక పోలీసు విభాగం ఏర్పాటు చేస్తామని తెలిపారు. పేదలకు ఏటా ఉచితంగా 6 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని పేర్కొన్నారు. వివాహం చేసుకున్న యువతులకు నెలకు నెలవారీగా రూ.2500 నగదు, ఒక బంగారు నాణెం, పట్టుచీర బహుమతిగా ఇస్తామని అన్నారు.