Reading Time: < 1 minute

హైదరాబాద్ : దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్) యుజి (నీట్ యుజి 2026) పరీక్షకు దరఖాస్తు గడువు ఆదివారం(మార్చి 8)తో ముగియనున్నది. మే 3వ తేదీన నీట్ యుజి పరీక్షను నిర్వహించనున్నారు. ఎంబిబిఎస్, బిడిఎస్, బిఎస్‌ఎంఎస్,బియుఎంఎస్, బిహెచ్‌ఎంఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏటా ఈ పరీక్ష నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇంగ్లీష్, హిందీ, తెలుగుతో పాటు మొత్తం 13 భాషల్లో మే 3న మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు పెన్ను, పేపర్ విధానంలో పరీక్ష జరుగనున్నది.