
పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మాస్ ఎంటర్టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ బాక్సాఫీస్ వద్ద తన ప్రతాపాన్ని చూపేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఈ మూవీపై అంచనాలు తారా స్థాయికి చేరాయి. ఈ సినిమా విడుదలకు కేవలం ఇక 12 రోజులు మాత్రమే సమయం ఉంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ల వేగాన్ని అమాంతం పెంచేసింది.
డబ్బింగ్ మొదలుపెట్టిన పవర్ స్టార్
పవన్ కళ్యాణ్ ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనులను ఈరోజే ప్రారంభించారు. దీనికి సంబంధించి ఒక ఫోటోను మేకర్స్ సోషల్ మీడియా పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ విపరీతంగా వైరల్ అవుతోంది. గబ్బర్ సింగ్ తర్వాత పవన్-హరీష్ కాంబినేషన్ కావడంతో, ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ డైలాగ్ డెలివరీపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈసారి కేవలం వినోదం మాత్రమే కాదు.. బాక్సాఫీస్ వద్ద యుద్ధం కూడా ఉంటుంది అన్నట్లుగా హరీష్ శంకర్ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు.
Power Star @PawanKalyan begins dubbing for #UstaadBhagatSingh ❤🔥
Post-production in full swing with Cult Captain @harish2you supervising it and @MusicThaman working to deliver a terrific score 💥
The surprise you have been waiting for will drop anytime today…stay tuned 🤩… pic.twitter.com/jHAggidTlV
— Ustaad Bhagat Singh (@UBSTheFilm) March 7, 2026
ఉస్తాద్ Vs ధురంధర్ 2
ఈ ఏడాది ఉగాది పర్వదినం సందర్భంగా మార్చి 19న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. అయితే, ఇదే రోజున బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ నటించిన భారీ యాక్షన్ సీక్వెల్ ‘ధురంధర్ 2: ది రివెంజ్’ కూడా విడుదలవుతోంది. టాలీవుడ్ వెర్సస్ బాలీవుడ్ అన్నట్లుగా సాగనున్న ఈ క్లాష్ ట్రేడ్ వర్గాల్లో ఆసక్తిని కలిగిస్తోంది. ముఖ్యంగా నార్త్ మార్కెట్‌లో కూడా పవన్ కళ్యాణ్‌కు ఉన్న క్రేజ్ నేపథ్యంలో ఈ పోటీ రసవత్తరంగా ఉండనుంది.
గ్లోబల్ హంగామా..
ఓవర్సీస్ మార్కెట్‌లో ఉస్తాద్ హవా అప్పుడే మొదలైంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ , యూకే (UK) లలో అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతుండటంతో థియేటర్ల సంఖ్యను పెంచుతున్నారు. దర్శకుడు హరీష్ శంకర్ తాజాగా తన సోషల్ మీడియాలో ‘Big Day’ అంటూ పోస్ట్ పెట్టి ఫ్యాన్స్ హైప్‌ను పీక్స్‌కు తీసుకెళ్లారు. అంతేకాకుండా, తెలుగు రాష్ట్రాల్లో అభిమానుల కోసం ఉదయం 4:30 గంటల నుంచే బెనిఫిట్ షోలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
ఈ మూవీలో పవన్ కల్యాణ్ సరసన శ్రీలీల, రాశీ ఖన్నా నటిస్తున్నారు. వీరిద్దరి గ్లామర్ ఈ మాస్ యాక్షన్ డ్రామాకు అదనపు బలం కానుంది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ (DSP) పాటలు అందిస్తుండగా, సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఎస్ (Thaman S) బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇస్తున్నారు. ఇద్దరు అగ్ర సంగీత దర్శకులు కలిసి పనిచేస్తుండటం ఇదే మొదటిసారి. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. మరో కొన్ని గంటల్లోనే టీజర్ లేదా ట్రైలర్ అప్‌డేట్ వచ్చే అవకాశం ఉండటంతో సోషల్ మీడియా అంతా పవర్ స్టార్ నామస్మరణతో మారుమోగిపోతోంది.