Reading Time: < 1 minute
Trump Calls Iran Loser Middle East Pezeshkian Apology

Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్‌ను హెచ్చరిస్తూ వ్యాఖ్యలు చేశారు. ఈ యుద్ధంలో గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు చేయడంపై ఆ దేశ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ స్పందిస్తూ.. క్షమాపణలు చెప్పారు. ఇరాన్ క్షమాపణలు చెప్పిన తర్వాత ట్రంప్ స్పందిస్తూ.. ‘‘ఇరాన్ మధ్యప్రాచ్యంలో ఓడిపోయిన దేశం’’గా అభివర్ణించారు. ఇరాన్ ఈ రోజు చాలా తీవ్రంగా దెబ్బతింటుందని కూడా ట్రంప్ హెచ్చరించారు.

Read Also: CM Revanth Reddy: 130 మంది మావోయిస్టుల లొంగుబాటుకు అధికారులు చాలా కృషిచేశారు

ట్రూత్ సోషల్ వేదికగా.. ‘‘అమెరికా, ఇజ్రాయిల్ నిరంతర దాడుల భయం వల్లే ఇరాన్ తన పొరుగు దేశాలకు క్షమాపణలు చెప్పింది. ఇకపై గల్ఫ్ దేశాలపై దాడులు చేయమని చెబుతోంది. మధ్యప్రాచ్యాన్ని తన గుప్పిట్లోకి తెచ్చుకుని పాలించాలని ఇరాన్ ప్రయత్నించింది. ఇరాన్ ఇకపై మధ్యప్రాచ్యంలో రౌడీ కాదు. ఇరాన్ ఇకపై ఓడిపోయిన వ్యక్తి. ఇరాన్ చెడు పాలన కారణంగా తీవ్రంగా దెబ్బతింది’’ అని ట్రంప్ అన్నారు.

దీనికి ముందు ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ మాట్లాడుతూ.. ఇకపై పొరుగు దేశాలైన కువైట్, బహ్రైయిన్, ఖతార్, యూఏఈ, సౌదీ అరేబియాలపై దాడులు చేయబోమని హామీ ఇచ్చారు. అయితే, ఇరాన్ ఎప్పటికీ లొంగిపోదని స్పష్టం చేశారు. ఇరాన్ ప్రజలు లొంగిపోతారని శత్రువులు భావిస్తే, వారి ఆశలు సమాధిలోకి వెళ్లాల్సిందే అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.