
అమరావతి: మాజీ సిఎం వైసిపి జగన్ మోహన్ రెడ్డి అనుచరుల జేబుల్లో వేలకోట్లు చేరాయని ఆరోపణలు వచ్చాయని ఎపి మంత్రి లోకేష్ తెలిపారు. గతంలో అక్రమ మద్యం.. వేల కుటుంబాలను నాశనం చేసిందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నగదు లావాదేవీలకు సంబంధించి ఆధారాలను ఇడి బయటపెట్టిందని తెలియజేశారు. ఈ ఆరోపణలపై ఎపి ప్రజలకు జగన్ సమాధానం చెప్పగలరా? అని..సమాధానం చెప్పలేక.. నిశ్శబ్దమే జగన్ సమాధానమా? అని లోకేష్ ప్రశ్నించారు. ఇదేనా జగన్ 2019లో నిషేధం అమలు చేస్తానన్న హామీ వెనక అసలు కథ? అని లోకేష్ విమర్శించారు.