Reading Time: < 1 minute

పెర్త్: ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత జట్టు ఆతిథ్య జట్టుతో ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 198 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. 2 పరుగుల వద్దే ఓపెనర్ జార్జియా వొల్(2) ఈ మ్యాచ్‌తోనే ఆరంగేట్రం చేసి సయాలి సత్ఘరే చేతిలో క్లీన్ బౌల్డ్ అయింది. ఆ తర్వాత లిచ్‌ఫీల్డ్ 9 పరుగులకే పెవిలియన్ చేరింది. కెప్టెన్ అలీసా హేలీ కూడా 13 పరుగులకే వెనుదిరిగింది.

ఈ దశలో ఎలీస్ పెర్రీ జట్టును ఆదుకుంది. 116 బంతుల్లో 76 పరుగులు చేసి జట్టు స్కోర్ పెరిగేందుకు తన ఒంతు కృషి చేసి ఔట్ అయింది. ఇక బంతితో భారత బ్యాటింగ్ ఆర్డర్‌ని కుప్పకూల్చిన అన్నాబెల్ సదర్లాండ్ బ్యాట్‌తోనూ చెలరేగిపోయింది. 171 బంతులు ఎదురుకున్న ఆమె 129 పరుగులు చేసింది. ఆ తర్వాత ఎవరూ పెద్ద స్కోర్ చేయలేకపోయారు. దీంతో ఆసీస్ 90.4 ఓవర్లలో 323 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఈ క్రమంలో ఆసీస్ 125 పరుగుల ఆధిక్యం సంపాదించుకుంది. భారత బౌలింగ్‌లో సయాలి 4, క్రాంతి గౌడ్, దీప్తీ శర్మ చెరి 2, స్నేహ్ రానా, షెఫాలీ తలో వికెట్ తీశారు.

ఇక రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన భారత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. డార్సీ బ్రౌన్ బౌలింగ్‌లో స్టార్ బ్యాటర్ స్మృతి(2) క్లీన్ బౌల్డ్ అయింది. ఆ తర్వాత రెండో ఓవర్‌లో షెఫాలీ(5) ఔట్ అయింది. దీంతో 2 ఓవర్ ముగిసేసరికి భారత్ 2 వికెట్ల నష్టానికి 10 పరుగులు చేసి 115 పరుగుల వెనుకంజలో ఉంది. క్రీజ్‌లో జెమీమా(0), ప్రతీకా రావల్(3) ఉన్నారు.