Reading Time: < 1 minute

సత్తుపల్లి: ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో శనివారం మధ్యాహ్నం  ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రాక్టర్‌ను బైక్ ఢీ కొట్టడంతో ఇద్దరు యువకులు మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతులు సిద్దారం గ్రామానికి చెందిన గద్దెల మనోజ్, గద్దెల కార్తీక్‌గా గుర్తించారు.  సిద్ధారం గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. మృతులు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయారు.