
వాషింగ్టన్: ఇరాన్ నాయకత్వం, సైన్యం, నౌకాదళం..కమ్యూనికేషన్స్ అన్నీ దెబ్బతిన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ తెలిపారు. ఇరాన్ నాయకత్వం రెండు దశల్లో పూర్తిగా నాశనం అయిందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఇరాన్ పై అమెరికా వైమానిక దళంతో పాటు సైన్యం అద్భుతంగా పని చేస్తుందని ప్రశంసించారు. ఇప్పుడు మూడో స్థాయి నాయకత్వం మాత్రమే ఉందని, చాలా సంవత్సరాలుగా అమెరికా ప్రజలపై దాడులు జరుగుతున్నాయని తెలియజేశారు. ఇప్పుడు ప్రపంచం మొత్తం అమెరికా సైన్యాన్ని మెచ్చుకుంటుందని ట్రంప్ పేర్కొన్నారు.