Reading Time: < 1 minute

గజ్వేల్: కరీంనగర్ జిల్లా కేంద్రంలో తహసీల్దార్ ఇంటిపై ఎసిబి దాడి చేసింది.  సిద్దిపేట జిల్లా గజ్వేల్ తహసిల్దార్ శ్రావణ్ కుమార్ ఇంట్లో ఎసిబి అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో భారీగా నగదు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న సమాచారంతో ఈ తనిఖీలు నిర్వహించారు. కరీంనగర్ లోని మహారాజా బార్ అండ్ రెస్టారెంట్ వెనుక ఉన్న ఇంటితో పాటు ఆర్టీసీ కాలనీలో రెండు చోట్ల ఎసిబి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. వీటితో పాటు శ్రావణ్ కుమార్ తండ్రి ఇంటి వద్ద లక్ష్మీ నగర్ లోని సోదరి ఇంట్లో సైతం ఎసిబి అధికారులు సోదాలు చేపట్టారు.