Reading Time: < 1 minute

టీ20 వరల్డ్‌ కప్‌ 2026లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న మొదటి సెమిఫైనల్ మ్యాచ్ లో సౌతాఫ్రికా జట్టు, న్యూజిలాండ్ కు 170 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. మార్కో యాన్సెన్ అర్ద శతకంతో చెలరేగాడు.

77 పరుగులకే ఐదు కీలక వికెట్లు కోల్పోయిన అనంతరం క్రీజులోకి వచ్చిన యాన్సెస్.. సౌతాఫ్రికాను ఆదుకున్నాడు. భారీ సిక్సులతో న్యూజిలాండ్ బౌలర్లలపై విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో కేవలం 30 బంతుల్లోనే 5 భారీ సిక్సులు, 2 ఫోర్లతో 55 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. బ్రెవిస్ 34 పరుగులు, స్టబ్స్ 29 పరుగులతో పర్వాలేదనిపించారు.  కివీస్ బౌలర్లలో రచిన్ రవీంద్ర, మెక్‌కాంచి, హెన్రీ తలో రెండు వికెట్లు తీయగా.. నీషమ్, ఫెర్గూసన్ చెరో ఒక వికెట్ పడగొట్టారు.