
దుబాయ్ ః అమెరికా, ఇజ్రాయెల్‌లు సంయుక్తంగా సాగిస్తున్న దాడులలో ఇరాన్‌లో మృతుల సంఖ్య బుధవారం కనీసం 1045 కు చేరుకుంది. పలు చోట్ల శిథిలాలు, రక్తసిక్త వీధులు కన్పిస్తున్నాయి. మృతుల సంఖ్యను ఇరాన్ ప్రభుత్వ పరిధిలోని అధికారిక సంస్థ బుధవారం అధికారికంగా ప్రకటించింది. రెండు దేశాల సైన్యం నివాసిత ప్రాంతాలపైనే నేరుగా దాడులకు దిగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ ఇరాన్‌కు చెందిన ఫౌండేషన్ ఆఫ్ మార్టియర్స్, అండ్ వెటర్న్ సంస్థ ఎప్పటికప్పుడు బాధితులు, మృతుల సంఖ్య ఇతర వివరాలను అంతర్జాతీయ మీడియాకు వెలువరిస్తోంది. పలు చోట్ల సామూహిక ఖననాలకు ఏర్పాట్లు చేశారు.
ఇక ఇరాన్ జరిపిన దాడులలో ఇప్పటివరకూ ఇజ్రాయెల్‌లో 11 మంది చనిపోయారు. కోన్ని ప్రాంతాల్లో భారీ విధ్వంసం జరిగింది. కువైట్‌లో బుధవారం ఇరాన్ దాడుల శకలాలు తగిలి 11 సంవత్సరాల బాలిక మృతి చెందింది. ఇంతకు ముందు ఇక్కడ ఒక్కరు చనిపోయారు. యుఎఇలో ముగ్గురు, బహరైన్‌లో ఒక్కరు ఇరాన్ దాడులలో మృతి చెందారు. ఇక కువైట్‌లో ఇరాన్ దాడులలో ఇప్పటికే ఆరుగురు అమెరికా ఆర్మీ రిజర్వ్ సైనికులు చనిపోయారు.