
హైదరాబాద్సిటీలోని నకిలీ సరుకుల దందా జోరుగా సాగుతోంది.. నూనెలు, అల్లం వెల్లుల్లి పేస్టులు, సబ్బులు, సరుపులు, గుడ్ నైట్ లు, ఆల్ అవుట్లు ఇలా ప్రతి నిత్యావసరాలను కల్తీ చేసి విక్రయిస్తున్నారు. తాజాగా బేగంబజారులో నకిలీ కిరాణా సరుకుల దందా గుట్టురట్టు చేశారు సీసీఎస్ స్పెషల్ టీం.
మంగళవారం( మార్చి3) హైదరాబాద్ సిటీలోని బేగంబజారులో పలు షాపులు, గోదాంలపై సీసీఎస్ స్పెషల్ టీం దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో హోల్ సేల్ గా విక్రయిస్తున్న నకిలీ టైడ్, ఏరియల్, సర్ఫ్ ఎక్సెస్, జెమినీ టీపొడి ప్యాకెట్లను గుర్తించారు. 1340 రెడ్ లేబుల్ నకిలీ ప్యాకెట్లు, 100 తాజ్ మహల్ టీ నకిలీ ప్యాకెట్లు, 75 కిలోల లూజ్ టీ పౌడర్, 1900 సర్ఫ్ ప్యాకెట్లు, 3600 నకిలీ గుడ్ నైట్ లిక్విడ్ బాటిల్స్ సీజ్ చేశారు.9500 నకిలీ లేబుల్ కవర్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ దందా నిర్వహిస్తున్న గుజరాతీకి చెందిన ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు.
►ALSO READ | ఉయ్యాల ఊగుతుండగా.. చీరమెడకు చుట్టుకొని 8ఏళ్ల చిన్నారి మృతి
గుజరాత డీలర్లనుంచి తక్కువ నాణ్యతగల మెటీరియల్ కొనుగోలు చేసి నకిలీ ప్యాకింగ్ కవర్లతో బ్రాండెడ్ గానమ్మించి అమ్ముతున్న గుజరాత్ కు చెందిన జయ రామ్(30), కచ్చవా సురేందర్(34), హనుమాన్ రామ్(21)లను సీసీఎస్ స్పెషల్ టీం అరెస్ట్ చేసి అఫ్జల్ గంజ్ పోలీసులకు అప్పగించారు. సరుకులు కొనుగోలు సమయంలో క్యూఆర్ కోడ్ తప్పనిసరిగా తనిఖీ చేయాలని పోలీసుల సూచిస్తున్నారు.