Reading Time: < 1 minute

ఉయ్యాల ఊగుతుండగా.. చీరమెడకు చుట్టుకొని 8ఏళ్ల చిన్నారి మృతి

Caption of Image.

బిడ్డ కోసం తల్లి ప్రేమతో కట్టిన ఉయ్యాల ఆ కుటుంబానికి విషాదాన్ని మిగిల్చింది. ఊయలకట్టిన చీర ఆమె పాలిట యమపాశమైంది. ఊయల కట్టిన చీర మెడకు చుట్టుకొని ఊపిరాడక ఎనిమిదేళ్ల చిన్నారి మృతిచెందిన  హృదయ విదారక ఘటన మేడ్చల్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..  

మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసముంటున్న నవనీత అనే మహిళకు ఇద్దరు ఆడపిల్లలు.. గత కొంతకాలంగా భర్తకు దూరంగా  ఉంటున్న నవనీత పనిమనిషిగా పలు ఇళ్లలో పనులు చేస్తూ జీవనం సాగిస్తోంది. చంటిబిడ్డ అయిన చిన్న కూతురు కోసం ఇంట్లో చీరతో ఊయల ఏర్పాటు చేసింది నవనీత. ఈక్రమంలో  మంగళవారం(మార్చి3) పనికోసం బయటికి వెళ్లిన నవనీత ఇంటికి తీరిగి వచ్చే సరికి పెద్ద కూతురు ఊయలో శవమై కనిపించింది. 

►ALSO READ | స్పోర్ట్స్ బైక్ మోజుతో.. డ్యూక్ అద్దెకు తీసుకున్న ఇంటర్ స్టూడెంట్స్… ట్రిపుల్ రైడింగ్ వెళ్లి… 

నవనీత పనికి వెళ్లిన సమయంలో ఆమె ఎనిమిదేళ్ల పెద్దకుమార్తె ఊయల ఊగుతుండగా మెడక చీర చుట్టుకొని ఊపిరాడక చనిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. నవనీత ఫిర్యాదు మేరకు  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టమ్​ కోసం  గాంధీ ఆస్పత్రికి తరలించారు. 

©️ VIL Media Pvt Ltd.