Reading Time: 2 minutes

Poonam Vs Pawan : మతమార్పిడి రాయబారి.. పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేస్తూ పూనమ్ కౌర్ సంచలన ట్వీట్!

Caption of Image.

తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనూ, రాజకీయ వర్గాల్లోనూ సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే హీరోయిన్లలో పూనమ్ కౌర్ ఒకరు.  ఆమె సోషల్ మీడియాలో పెట్టి పోస్టులు తరచూ హాట్ టాపిక్ అవుతుంటాయి. అసలు విషయమేంటో డైరెక్ట్ గా చెప్పకుండా.. ఎవరినో ఉద్దేశిస్తూ పూనమ్ చేసే ట్వీట్స్ వివాదాస్పదంగా మారుతాయి. లేటెస్ట్ మరోసారి వార్తల్లో నిలిచారు . సోషల్ మీడియాలో తాను పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.

టార్గెట్ పవన్?

 తాజాగా పూనమ్ తన ట్వీట్ లో ఎవరి పేరును నేరుగా ప్రస్తావించకుండా..  పరోక్షంగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేస్తూ విమర్శలకు దిగిందని సినీ,రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.  మూడు నెలల వయసులోనే విదేశాలకు తీసుకెళ్లి తమ పిల్లలకు బాప్టిజం ఇప్పించి, తన వారసత్వాన్ని ఆర్థోడాక్స్ క్యాథలిక్ క్రైస్తవంలోకి ఎందుకు మార్చారు? హిందువుగా ఉండటం అంటే కేవలం రాజకీయ డ్రామా కోసం ఆ కాస్ట్యూమ్స్ ధరించడమేనా? విదేశాలకు వెళ్లగానే ఆ కాస్ట్యూమ్స్ మారిపోతాయా?” అంటూ తన పోస్ట్ లో పేర్కొంది.

►ALSO READ | Rishab Shetty: రష్మిక మిమ్మల్ని పెళ్లికి పిలిచిందా? రిషభ్ శెట్టి షాకింగ్ రియాక్షన్ వైరల్!

 మతమార్పిడి రాయబారు అంటూ..

 ఒకప్పుడు ఎంతో గొప్ప చరిత్ర కలిగిన కాపు సామాజిక వర్గ వారసత్వం ఇప్పుడు ఆర్థడాక్స్ కాథలిక్ క్రైస్తవంగా మారిపోయిందని.. ఇలాంటి వారు ‘మతమార్పిడి రాయబారు’ (Conversion Ambassador)ల‌ని అంటూ తన సోషల్ మీడియాలో పూనమ్ పోస్ట్ చేసింది..  అయితే పూనమ్ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. నేరుగా ఎటాక్ కిదిగారుగా అని ఓ వ్యక్తి రీట్వీట్ చేయగా… పవర్ కళ్యాణ్ అభిమానులు ఆమె పోస్ట్ పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వ్యక్తిగత జీవితాన్ని రాజకీయం చేయవద్దని మండిపడుతున్నారు. ఆమె విమర్శల్లో వాస్తవం ఉందంటూ మరి కొందరు ఆమెకు మద్దతు తెలుపుతున్నారు. దీనికి ఇది ఎటాక్ కాదని, తనకు వచ్చిన ఓ డౌట్ మాత్రమేనని పూనమ్ చెప్పుకొచ్చింది.

 

©️ VIL Media Pvt Ltd.