Reading Time: < 1 minute

హైదరాబాద్: కామారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి రెండేళ్లుగా ఆన్ లైన్ గేమ్ లకు బానిసయ్యాడు. ఓం శాంతి కాలనీకి చెందిన శ్రీకర్ (30) ఆన్ లైన్ గేమ్ లో రూ. 20 లక్షల మేర నష్టపోవడంతో మనస్థాపం చెంది ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బాధితుడి తల్లి కామారెడ్డి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు తెలియాల్సి ఉంది.